ముషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో బాంబు పేలుడు కలకలం


హైదరాబాద్‌ ముషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రాంనగర్‌లో  చెత్త ఏరుకుంటోన్న వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న డబ్బాలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు సంభవించింది. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు నాగయ్యగా పోలీసులు గుర్తించారు. ఇతణ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెత్త కుండీలో పడేసిన పెయింట్‌ డబ్బా పేలి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి డాగ్‌ స్క్వాడ్‌తో చుట్టుపక్కల తనిఖీలు చేయించారు. అయితే, పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.చెత్త డబ్బాలో పేలుడు పట్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలాన్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, స్థానిక నాయకులు పరిశీలించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )