కొత్త కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం కేసీర్


 తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే భారీ స్థాయిలో ఐఏఎస్ లు , కలెక్టర్ల బదిలీలు జరిగాయి . తెలంగాణ అభివృద్ధి కోసమే ఈ బదిలీలు చేసారని పలువురు వెల్లడించారు . 21  మంది  కొత్త కలెక్టర్స్ ల నియామకం జరిగింది . వారికీ దిశా నిర్దేశం కోసం తెలంగాణ సీఎం కెసిఆర్ గారు  ఈ నెల 11 న కలెక్టర్ల తో సమావేశం కానున్నారు . ఈ సమావేశం 11 న ప్రగతి భవన్ లో ఉదయం 11 నుండి కొనసాగనుంది . ఇదే సమావేశం లో జిల్లాల వారి అభివృద్ధి కార్యక్రమాలు , పల్లె ప్రగతి , పట్టణ  ప్రగతి పలు విషయాలపై సీఎం చర్చించనున్నారు .

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )