చైనా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రతీ ఒక్కరికి అన్ని పరీక్షలు - వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రా జేందర్‌


రాష్ట్రంలో ఇప్ప టివరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు’అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రా జేందర్‌ అన్నారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ ‘నెలరోజుల నుంచి కరోనా వైరస్‌ భయపెడుతోంది. చైనా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రతీ ఒక్కరికి అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను అప్రమత్తం చేశాం’అని చెప్పారు. ఇప్పటివరకు చైనా నుంచి 52 మంది వచ్చారని. ఇందులో 25 మందికి పుణేలో, 25 మందికి గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కరోనా, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఒకేరకంగా ఉంటాయని, ఎవరికైనా అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకో వాలని సూచించారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఒక ప్రత్యేక అధికారితో పాటు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )