గురుకులాల్లో ప్రవేశాలకు మొదలైన దరఖాస్తుల స్వీకరణ


తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి పరిధిలో ఉన్న జూనియర్‌ కళాశాలల్లో చేరేందుకు ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓసీ పదోతరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బాలుర కళాశాలల్లో నాదర్గుల్‌, జిన్నారం, కుల్కచర్ల, బాలికల జూనియర్‌ కళాశాలలు బోడుప్పల్‌, తాండూరు, జహీరాబాద్‌, మానూర్‌, నారాయణ్‌ ఖేడ్‌లలో 2020-21 విద్యాసంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, వృత్తి విద్యా కోర్సులలో విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు వివరాలను http://www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌లో ద్వారా అందజేయాలని రాజేంద్రనగర్‌ టీటీడబ్ల్యూ ఐఐటీ స్టడీసెంటర్‌ ప్రధానాచార్యులు కె.నాగార్జునరావు ప్రకటనలో తెలిపారు.  ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.  వివరాలకు 7382931496, 9696374292, 9493966124 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )