ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనాన్ని ఎగురవేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్


ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు సరికొత్త తీర్పునిచ్చారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ..ఆమ్‌ ఆద్మీ పార్టీపై నమ్మకముంచి మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. ఇవాళ ఢిల్లీ ప్రజలకు లార్డ్‌ హనుమాన్‌ దీవెనలు అందించారు. వచ్చే ఐదేళ్లలో ఢిల్లీ ప్రజలకు మరింత సేవ చేసేందుకు సరైన మార్గాన్ని చూపాలని హనుమాన్‌ను కేజ్రీవాల్‌ కోరుకున్నారు. మరో ఐదేళ్లపాటు మనమందరం కలిసి కష్టపడదామని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 63 స్థానాల్లో గెలిచి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ 7 స్థానాలకే పరిమితం కాగా..కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేకపోయింది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )