హైదరాబాద్ కి చేరిన కరోనా వైరస్ : కట్టుదిట్టమైన భద్రత
తెలంగాణ లో కరోనా వైరస్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే గాంధీ ఆసుపత్రి లో ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసింది .  గాంధీ ఆసుపత్రి లోని కరోనా ప్రత్యేక వార్డు ని నోడల్ కేంద్రంగా వెల్లడించారు . కరోనా టెస్టింగ్ఫ్ నిర్దారణ ఇక్కడే చేస్తామని వైద్యులు తెలియచేసారు. అదే విధంగా 9392249569 ను హెల్ప్ లైన్ నంబర్ ని ఏర్పాటు చేసారు . గాంధీ యూనిట్ కి అధునాతన ఎక్విప్మెంట్ తెప్పించమని అధికారులు వెల్లడించారు .

కరోనా వైరస్ టెస్టింగ్ కోసం ట్రైనింగ్ లో భాగంగా కరోనా వైరస్ కలిగిన శాంపిల్స్ ని పూణే వైరాలజి లాబ్ నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వైరాలజి లాబ్ కు తెప్పించారు . దీంతో ఆసుపత్రి దగ్గర ఆందోళన వాతావరణం నెలకొనింది. ఏదైనా అపశృతి నెలకొంటే వైరస్ వ్యాప్తి చెందుతుంది అని అక్కడి ప్రజలు భయపడుతున్నారు . కానీ వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడి చేసారు .

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )