బీహార్ అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసుల బృందం


హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పరిధిలో చోరీలకు పాల్పడుతున్న బీహార్ అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా వద్ద నుంచి భారీ ఎత్తున నగలు,డబ్బు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1కోటి వరకు ఉంటుందని హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు. ముఠా వద్ద నుంచి ఓ బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. బషీర్‌బాగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన వివరాలు వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం.. ముఠాలోని సభ్యులు బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో వంట మనుషులుగా చేరారు. గతేడాది డిసెంబర్‌లో ఇంటి యజమానులు ఫంక్షన్‌కు వెళ్లగా.. 1.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, డైమండ్‌ నగలను చోరీ చేసి పరారయ్యారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.రెండు నెలలుగా ముఠా కోసం వెతుకుతున్న పోలీసులు ఎట్టకేలకు వీరిని పట్టుకున్నారు. నిందితులంతా బీహార్‌ రాష్ట్రంలోని మధుబని ప్రాంతానికి చెందినవారని, రామషిష్‌ ముఖియా వీరి ముఠాకు బిగ్‌బాస్ అని గుర్తించారు. ముఖియా ఆదేశాల మేరకు దొంగతనాలు చేస్తుంటారని గుర్తించారు. దొంగతనానికి పాల్పడే ముందు నెల రోజులు రెక్కీ నిర్వహించి ఓ ఇంటిని ఎంచుకుంటారని చెప్పారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )