హిమయత్‌నగర్‌ గౌడ వసతిగృహ ప్రాంగణంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌

హిమయత్‌నగర్‌లో గల గౌడ వసతిగృహ ప్రాంగణంలో హాస్టల్‌  ఎంపీ సంతోష్‌ కుమార్‌ , హాస్టల్  కార్యవర్గ సభ్యులు, విద్యార్థులు మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో గౌడ్‌ హాస్టల్‌ ప్రెసిడెంట్‌ పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌, ఉపాధ్యక్షులు పుల్లెంల రవీందర్‌ గౌడ్‌, జ్ఞానేశ్వర్‌ గౌడ్‌, జనరల్‌ సెక్రటరీ చక్రవర్తి గౌడ్‌, ట్రెజరర్‌ శైలాజా గౌడ్‌, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ, ప్రతినిధి కిషోర్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌ మరో ముగ్గురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. వెలమ హాస్టల్‌ ప్రెసిడెంట్‌ ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌, రెడ్డి హాస్టల్‌ ప్రెసిడెంట్‌ అమ్మా మేరి, కురుమ హాస్టల్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ను గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా కోరారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )