హైదరాబాద్ లోని అక్రమ నల్లలపై చర్యలు తీసుకుంటున్న విజిలెన్స్‌ అధి​కారులు


గరంలో అక్రమ నీటి కనెక్షన్లపై విజిలెన్స్‌ అధి​కారులు కొరడా ఝుళిపించారు. ముందస్తు సమాచారం మేరకు అధికారులు గురువారం పలు చోట్ల దాడులు నిర్వహించారు.  అక్రమంగా నీటిని వాడినందున అతని అక్రమ నీటి కనెక్షన్లు తొలగించామని, క్రిమినల్‌ కేసు కూడా నమోదు చేశామని అధికారులు పేర్కొన్నారు. గతంలో వెంకటేశ్‌ నీటి కనెక్షన్ల బిల్లులు రూ.29,42,549 బకాయి పడ్డాడని వెల్లడించారు. ఇదే కాక అదనంగా అక్రమంగా వినియోగించిన నీటి సెస్సుతో కలిపి ఆ వ్యక్తి మొత్తంగా రూ.40లక్షలు చెల్లించాలని అధికారులు తెలిపారు. హెఎమ్‌డబ్ల్యూఎస్‌, ఎస్‌బోర్డ్‌ ఆదేశాల మేరకు నగరంలో అక్రమంగా నీటి కనెక్షన్లు, నీటిమోటార్లు, మీటర్లు కలిగి ఉన్నవారిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐడీఏ నాచారంకు చెందిన స్టాలిన్‌ టైర్స్‌ యజమాని వి.ఎమ్‌.ఎన్‌ వెంకటేష్‌ 40 ఎమ్‌.ఎమ్‌ నీటి కనెక్షన్లను పారిశ్రామిక కేటగిరీలో అక్రమంగా వాడుతున్న విషయాన్ని గుర్తించామని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )