ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేసేందుకు అనుమతులు లేవు.- మంత్రి ఈటల రాజేందర్


తెలంగాణలో కరోనా వైరస్‌పై పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంయమనం పాటించాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోనే వైద్యపరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . దీంతో సోమవారం నుంచి ఇక్కడే వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేసేందుకు అనుమతులు లేవు. చిన్నారికి సాధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా, కరోనా సోకిన విషయం తేలిందని ఆ ఆస్పత్రి లేఖలో వెల్లడించినట్లు వివరించాయి. ఆ ప్రైవేటు ఆస్పత్రి తీరుపై గాంధీ వైద్యులు అసహనం వ్యక్తం చేశారని పేర్కొన్నాయి. ఇది సున్నితమైన అంశం అయినందున కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం ఒక గాంధీ ఆస్పత్రికే అనుమతి ఇచ్చిందని వివరించాయి.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )