మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ‘తెలంగాణ కళా జాతర’ ....

తెలంగాణ కళలకు మరింత ప్రాచూర్యం కల్పించడంతోపాటు కళాకారులకు చక్కటి వేదికనందించేందుకు మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ‘తెలంగాణ కళా జాతర’ పేరిట నిర్వహిస్తున్న తెలంగాణ కళలకు మంచి ఆదరణ లభిస్తోంది. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ జాతర రెండోరోజు  రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన పలు కళలను ప్రదర్శించిన తీరు ఎంత గానో ఆకట్టుకుంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన కళాకారులు హాజరై  తమ కళల ప్రదర్శిన తీరు అద్భుతంగా నిలుస్తున్నాయి. లంబాడీ, గుస్సాడీ, బుర్రకథ, చెక్క భజన, చిందు బాగోతం, చిరుతల కోలాటం, మృదంగం, ఒగ్గు కథ, ఒగ్గు డోలు, కత్తుల నృత్యం, కొమ్మ బూరలు,  పగటివేషాలు, పెద్దమ్మ లోల్లు, పులి వేషాలు, చెక్క బొమ్మలాట, పెర్ని శివతాండవం, సాధనశూరులు, లంబాడి బిందెల నృత్యాలతోపాటు తెలంగాణ రాష్ర్టానికి చెందిన పురాతన కళలను కళాకారులు ప్రదర్శించిన తీరు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మూడు రోజులపాటు కొనసాగే కళా జాతరలో 33 జిల్లాలకు చెందిన కళాకారులు 33 గంటలపాటు తమ ప్రదర్శనలను కొనసాగించనున్నారు. కళా జాతర రెండో రోజున సంగీత విభావరితోపాటు బుల్లితెర కమెడియన్లు తమ కామెడీతో సం దర్శకులను ఎంతగానో నవ్వించారు. రాష్ట్ర కళలు, కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సాహాన్ని అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )