శంషాబాద్‌లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో కూడిన ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు : భూసేకరణలు ఆదేశాలు జారీ చేసిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌


ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో కూడిన ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు శంషాబాద్‌లో అవసరమైనలాండ్ సేకరణకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రాజేంద్రనగర్‌ ఆర్‌డీవో చంద్రకళను అవసరమైన స్థలాన్ని వెంటనే సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో సీనియర్‌ సినీనటులు చిరంజీవి, నాగార్జునలతో మంత్రి సమావేశమయ్యారు.  సినీ, టీవీ కళాకారుల ఇళ్ల నిర్మాణం కోసం చిత్రపురి కాలనీ తరహాలో పరిసర ప్రాంతాల్లో మరో 10 ఎకరాల స్థలం కేటాయించాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, 24 విభాగాల సినీ కళాకారులకు సాంకేతిక నైపుణ్యం పెంపుకోసం అవసరమైన శిక్షణా కేంద్రం నిర్మాణానికి జూబ్లీహిల్స్, నానక్‌రాం గూడ ప్రాంతాలలో స్థలాలు కేటాయించా లని సినీనటులు ప్రతిపాదిం చారు. సినిమా షూటింగుల అనుమతుల కోసం వివిధ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకురాగా, సింగిల్‌ విండో విధానంలో ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో షూటింగ్‌ అనుమతులిచ్చేలా వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి చెప్పారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )