కాళేశ్వరం పర్యటించనున్న తెలంగాణ సీఎం కేసీర్

కాళేశ్వరం పర్యటించనున్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు . ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా ఆకాశమార్గంలో కాళేశ్వరం బయలుదేరుతారు. ఉదయం 9.40 గంటలకు కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అక్కడే ఉన్న గోదావరి ఘాట్‌ను సందర్శిస్తారు. ముక్తేశ్వర స్వామి దర్శనం తరువాత లక్ష్మీ బ్యారేజ్‌(మేడిగడ్డ రిజర్వాయర్‌ను సందర్శించనున్నారు. అక్కడే మధ్యాహ్న భోజనం పూర్తిచేసి మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌కు హెలికాప్టర్‌ ద్వారా పయనం కానున్నారు. 2.40 గంటలకు తీగలగుట్టపల్లి నివాసానికి చేరుకొంటారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం కానున్నట్లు సమాచారం. సాయంత్రంలోగా హెలికాప్టర్‌ ద్వారా గానీ రోడ్డు మార్గంలో గానీ తిరిగి హైదరాబాద్‌ ప్రగతిభవన్‌కు బయలుదేరనున్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )