కరీంనగర్ జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం


కరీంనగర్ జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏఎస్‌ వాహనాన్ని భారీ గ్రానైట్ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురిరి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో కరీంనగర్ నుంచి పూడూరుకు వెళుతుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనంలో ఇరుక్కుపోయిన ఆటో డ్రైవర్ మృతదేహాన్ని అరగంటపాటు శ్రమించి బయటకు తీసినట్లు చెప్పారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )