సీఏఏను వ్యతిరేకిస్తూ తొలి తీర్మానం చేసిన జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌డిప్యూటీ మేయర్‌ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా టీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశంలో సీఏఏను వ్యతిరేకిస్తూ తొలి తీర్మానం చేసిన కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీయేనని మేయర్‌ పేర్కొన్నారు.సీఎం స్ఫూర్తితో ప్రతిపాదించిన ఈ తీర్మానానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాల్సిందిగా కోరగా, సభ్యులందరూ బల్లలు చరుస్తూ తమ ఆమోదం తెలిపారు. ఫసీయుద్దీన్‌ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో సీఏఏను వ్యతిరేకించారని పేర్కొన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా సీఏఏపై తన వాణిని స్పష్టంగా విన్పించారని చెప్పారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా పక్షపాతంతో తీసుకొచ్చిన సీఏఏను అందరూ వ్యతిరేకించాల్సిందేనన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా, లౌకికతత్వాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉన్న చట్టమని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఎంఐఎంకు చెందిన మాజీ మేయర్‌ మాజిద్‌హుస్సేన్, ఎమ్మెల్సీ జాఫ్రీ, టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ ప్రభాకర్, కార్పొరేటర్లు జగదీశ్వర్‌ గౌడ్, సింగిరెడ్డి స్వర్ణలత మద్దతు ప్రకటించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )