CM కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ

 ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ప్రగతి భవన్‌లో ఆదివారం సీఎంను కలిసిన ఆయన పాతబస్తీలోని లాల్‌ దర్వాజ సింహవాహిని మహాంకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎంను కోరారు. ఈ మేరకు సీఎంకు అక్బరుద్దీన్ వినతి పత్రంసమర్పించారు . ప్రతి ఏటా నిర్వహించే బోనాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని చెప్పారు. మహాంకాళి దేవాలయం వద్ద సరిపడా స్థలం లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే కేసీఆర్‌కు వివరించారు. అందువల్ల ఆలయాన్ని రూ.10 కోట్లతో విస్తరించాలని కోరారు. అంతేకాదు అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతుల అంశమూ సీఎం దృష్టికి తీసుకెళ్లారు . ఈ మసీదును కోసం రూ.3 కోట్లు మంజూరు చేయాలని కేసీఆర్‌ను ఒవైసీ కోరారు. రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి తక్షణం నిధులు మంజూరు చేస్తామని కేసీఆర్‌, ఆయనకు హామీ ఇచ్చారు. అక్బరుద్దీన్ వినతికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఆలయ విస్తరణకు, మసీదు అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.






( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )