హైదరాబాద్‌లో పోలీస్ విభాగాలలో భారీ మార్పులు : కొత్త IPS ల నియామకం


హైదరాబాద్‌లో సైబరాబాద్, రాచకొండలతో పోలిస్తే  భారీ మార్పులు జరుగనున్నాయి . దాదాపు 11 నెలలుగా పదోన్నతి పొందిన IPS  అధికారులు బదిలీ ఉత్తర్వుల కోసం ఎదరు చూస్తున్నారు. సాధారణంగా కమిషనర్‌ స్థాయి అధికారులకు రెండేళ్లు టెన్యూర్‌గా పరిగణిస్తూ ఉంటారు. ఇది పూర్తయినప్పటి నుంచి బదిలీ ఇప్పుడా.. అప్పుడా..అనే పరిస్థితే ఉంటుంది. నగరంలో ఉన్న మూడు కమిషనరేట్లలోనూ రాచకొండ సీపీ మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ ఈ పోస్టులో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బదిలీ అనివార్యమని వినిపిస్తోంది. మరోపక్క ఆయన త్వరలో అదనపు డీజీగా పదోన్నతి పొందనున్న నేపథ్యంలో అప్పటి వరకు ఇదే పోస్టులో కొనసాగుతారనే వాదనా ఉంది. మరోపక్క నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈ పోస్టులోకి వచ్చి 22 నెలలే అవుతోంది. దీంతో ఆయన  బదిలీ ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )