KTR మరో కొత్త ప్లాన్ .. ఇది వర్కౌట్ అయితే హైదరాబాద్ దేశంలోనే టాప్


తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పధంలో దూసుకుపోనుంది . ఒక వైపు సాఫ్ట్ వేర్ రంగం లో దేశంలోనే మొదటి స్థానం లో నెలకొననుంది . అదే కాకుండా అనేక విషయాలలో హైదరాబాద్ నగరమే టాప్ . అమెజాన్ , గూగుల్ , మైక్రోసాఫ్ట్ , ఇంటెల్ , ఆపిల్ లాంటి సంస్థలు మన హైదరాబాద్ లోనే నెలకొన్నాయి . ఈ సంస్థల వల్ల ప్రపంచ స్థాయి లో ఖ్యాతి హైదరాబాద్ కి సొంతం అయింది .

హైదరాబాద్ మెట్రో కూడా దేశంలోనే టాప్ గా నిలువనుంది . దీనికోసం కేటీర్ కొత్త నిర్ణయం తీసుకొన్నాడు . ఇప్పటికే 58 కిలోమీటర్స్ మెట్రో మార్గంతో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ రవాణా మార్గాన్ని కలిగి ఉంది . అదే కాకుండా ఇంకా 15 కిలోమీటర్స్ అందుబాటులోకి రానుంది . అదే కాకుండా మెట్రో ని ఈ సంవత్సరమే శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగింపు పై అధికారిక నిర్ణయం తీసుకుంటుంది అని శుభ వార్త తెలియజేశారు .

ఇదికనక మొదలైతే ఢిల్లీ  కాకుండా మెట్రో విషయానికి మన హైదరాబాద్ నగరమే టాప్ స్థానం లో నిలువనుంది .



( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )