భారీగా పెరిగిన LPG గ్యాస్ సిలిండర్ ధరలు : ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.936.50

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన చమురు ధరలను అనుసరించి ఇంధన కంపెనీలు వంటగ్యాస్‌ ధరలు పెంచాయి. దీంతో గ్యాస్‌ ధర భారం సామాన్యుడిపై పడింది. ఇప్పటి వరకు సిలిండర్‌ ధర రూ.788 ఉంది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు రూ.206 రాయితీ కల్పిస్తూ లబ్ధిదారుని అకౌంట్‌లో ఆ మొత్తం జమచేస్తుంది. అంటే ఒక్కో సిలిండర్‌ వినియోగదారుడికి రూ.582కి అందుతుంది. ప్రస్తుతం ఆయిల్‌ కంపెనీలు సిలిండర్‌ దరను పెంచాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.148.50 పెంచాయి. దీంతో ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.936.50కి చేరింది. అయితే ఇందులో ప్రభుత్వం సబ్సిడీని రూ.348కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )