ఇండియా లో మొబైల్ డేటా చార్జీలు కనీసం 1GB కి 35 రూపాయలకి పెంచే యోచనలో ట్రాయ్

 
ఇండియా లో మొబైల్ డేటా చార్జీలు కనీసం 1గిబికి 35 కి పెంచే యోచనలో  ట్రాయ్ .  భారతీయ మొబైల్ వినియోగదారులు గత కొన్నేళ్లుగా ప్రపంచంలోనే చౌకైన మొబైల్ డేటా రేట్లను ఆస్వాదిస్తున్నారు. కానీ ఇది త్వరలోనే ముగియనుంది. భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్‌ బిల్లుల మోత మోగనుంది. టెలికాం ఆపరేటర్లు కోరిన విధంగా రేట్ల(కనీస రేట్లు)ను నిర్ణయించినట్టయితే ప్రస్తుత స్థాయి నుంచి మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరుగుతాయి. అయితే.. మొబైల్ ఆపరేటర్లు ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తే.. మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరిగే అవకాశముంది. కనీసం 1 జీబీ ధరను రూ.35 గా నిర్ణయించాలని వోడాఫోన్ ఐడియా, రూ. 30లుగా ఉండాలని, ఎయిర్టెల్, రూ. 20ల కనీస చార్జీగా వుండాలని రిలయన్స్ జియో ఇప్పటికే ట్రాయ్ కి ప్రతిపాదించాయి. భారత మొబైల్ వినియోగదారులు ప్రస్తుతం ఒక జీబీ కి రూ. 3.5ల చొప్పున 4జీ డేటా ను పొందుతున్నారు. మరోవైపు.. ట్రాయ్ సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది.