ఈ నెల 12 నుండి దక్షిణాఫ్రికా తో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్


ఈ నెల 12 నుండి దక్షిణాఫ్రికా తో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. కానీ ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ఆటగాలే మన భారత్ కు వస్తున్నారు. అయితే ప్రస్తుతం మన దేశం లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఆ వైరస్ ప్రభావం ఇప్పుడు ఈ వన్డే సిరీస్ పైన కూడా పడింది. భారత్ పర్యటనకు వస్తున్న తమ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ కొన్ని సూచనలు చేసింది. ఇక్కడ ఉనని రోజులు ఎవరితో చేతులు కలపకూడదని తెలిపింది. అంతే టీం ఇండియా ఆటగాళ్ళు తో కూడా అలాగే అభిమానులతో ఫొటోలు, సెల్ఫీలు కూడా దిగకూడదని చెప్పిందట. ఈ సూచనలు కేవలం ఈ సిరీస్ కు మాత్రమే కాదు ఐపీఎల్ కు కూడా వర్తిస్తాయని తెలిపింది. అయితే దక్షిణాఫ్రికా ఈ పర్యటనలో భారత్ తో కలిసి మార్చి 12న ధర్మశాల లో తొలి వన్డే, మార్చి 15న లఖ్‌నవూ లో రెండో వన్డే, మార్చి 18న కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌ లో చివరి వన్డే ఆడనుంది. అయితే చూడాలి మరి ఈ సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారో.