ఎంపీ రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ : ఆదేశాలు జారీ చేసిన ఉప్పర్‌పల్లి న్యాయస్థానం


ఉప్పర్‌పల్లి న్యాయస్థానం ఎంపీ రేవంత్ రెడ్డికి  14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు ఎంపీ రేవంత్ రెడ్డిని చర్లపల్లి  జైలుకు తరలించారు.   \ రెండు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా జన్వాడలో అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేశారనే కేసులో రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన సోదరుడు, మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్‌ రెడ్డి గురువారం (మార్చి 5) మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డిని మాదాపూర్‌ ఏసీపీ, నార్సింగ్‌ సీఐ విచారించారు. అనంతరం రేవంత్‌తో పాటు ఆయన అనుచరులను అరెస్ట్‌ చేసి ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. మరోవైపు.. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖండించారు. కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్డారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )