ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా : అధికారికంగా వెల్లడి


కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అల్లకల్లోలాన్నీ సృష్టిస్తుంది . కరోనా వైరస్‌ కారణంగా ఈనెల 29 నుంచి ప్రారంభం కావలసిన ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా కేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మ్యాచులు నిర్వహించినట్లయితే లక్షలాదిమంది ప్రజలు ఒక్కచోటకు చేరుతారు కనుక కరోనా వైరస్ సులువుగా వ్యాపించవచ్చుననే భయంతో హర్యానా, డిల్లీ, ముంబై, కర్ణాటక ప్రభుత్వాలు మ్యాచ్ నిర్వహణకు అనుమతి నిరాకరించాయి. కానీ ఈ దశలో ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా వేస్తే వేలకోట్లు నష్టం వాటిల్లుతుంది కనుక ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాలలోనైనా మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కానీ విదేశాలలో చేసిన ఆ ప్రయోగం విఫలం అయినట్లు తెలుసుకొని ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.