ఆసియా కప్ టీ-20 ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కి ఎదొరొస్తున్న అవాంతరాలు


కరోనా వైరస్ దెబ్బకి పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్ని వాయిదా అవుతున్నాయి . MWC, గూగుల్ , శంసుంగ్, ఇలా చాల వాయిదా పడ్డాయి, కొన్ని కాన్సిల్ అయ్యాయి .  ఇవేకాక ఇండియా , పాక్ ఇంటర్నల్ వార్ వాళ్ళ ఆసియ కప్ అసలు జరుగుతుందో లేదో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు .   ఆసియా కప్ టీ-20 ఇంటర్నేషనల్ టోర్నమెంట్ తటస్థ కేంద్రంలోనే ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఇషాన్ మణి ప్రకటించాడు. ఈ టోర్నీని దుబాయ్‌లో నిర్వహిస్తారంటూ భారత క్రికెట్ ని యంత్రణ బోర్డు (బీసీసీఐ) చైర్మన్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇషాన్ మణి అతని ప్రకటనను పరోక్షంగా ధ్రువీకరించాడు. వాస్తవానికి ఆసియా కప్ టీ-20కి పాకిస్తా న్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత జట్టును పంపడానికి కేంద్రం అంగీకరించదనేది వాస్తవం. భారత్ లేకుండా ఆసియా కప్ ను నిర్వహిస్తే, ప్రజాదరణ ఉందనేది కూడా నిజం. భారత్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను రద్దు చేసుకోవడంతో ఇప్పటికే ఆర్థికంగా దారుణంగా నష్టపోయిన పీసీబీ మొండిపట్టుతో ముందుకెళ్లే అవకాశం లేదు. పరిస్థితిని గమనించిన ఇషాన్ మణి ఓ మెట్టు దిగాడు. ఆసియా కప్‌ను తటస్థ వేదికపైనే ఆడతామని ప్రకటించాడు. ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నాడు. అతని ప్రకటనతో, ఈ టోర్నీలో భారత్ పాల్గొనడం దాదాపు ఖాయమైంది.