హైదరాబాద్ ;ప్రజలకు శుభవార్త : సుమారు 250 కోట్లతో వంతెనలు , స్కైవేలు

హైదరాబాద్ లోని  రద్దీ ప్రాంతాల్లోనడిచే వారి కష్టాలు తీరనున్నాయి. ఇక భద్రంగా రోడ్డు దాటేయవచ్చు. నగరంలోని రద్దీ ఉన్న చోట 38 పాదచారుల వంతెనలు, ఎనిమిది స్కైవేలు నిర్మించనున్నారు. ఇందుకు రూ. 239.55 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 52 పాదచారుల వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, ఇందులో 38కి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు, కొన్ని అంతకన్నా ముందే పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )