మే 29న లవ్ స్టోరీ సినిమా విడుదల :


నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతుంది. మొదట్లో ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల చెయ్యాలి అనుకున్నా ఆ తరువాత నిర్మాతలు తమ అభిప్రాయం మార్చుకున్నారు. సినిమా జులైకి వాయిదా పడబోతుందని వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని మే 29న సినిమా విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దానిపై అధికారిక ప్రకటన లేదు. అయితే ఇప్పటివరకు అసలు సినిమా ఎందుకు వాయిదా పడాలి అనేదాని మీద ఎటువంటి సమాచారం లేదు. తాజాగా ఒక వార్త వచ్చి అక్కినేని అభిమానులను కలవరపెడుతుంది. ఈ సినిమా ఫ్యూటేజ్ దాదాపుగా ఎనిమిది గంటలు వచ్చిందట. దానిని తగ్గించే పనిలో పడ్డాడు శేఖర్ కమ్ముల. అంటే దాదాపుగా 70% ఫ్యూటేజ్ ని సినిమాలో నుండి తీసివెయ్యాలి. ఇది తేలికైన విషయం కాదు. ఎలా చూసినా మూడు గంటల సినిమా కావడం ఖాయమని అంటున్నారు. వేసవిలో మూడు గంటల సినిమాని థియేటర్స్ లో చూడటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే ఈ మధ్య వచ్చే సినిమా రెండున్నర గంటలకు మించడం లేదు. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా కనిపిస్తాడట. దీని కోసం తెలంగాణ యాసలో మాట్లాడటానికి కోచింగ్ తీసుకుంటున్నాడు చైతన్య.