మార్చి 31 వరకు తెలంగాణ బంద్ : స్కూల్ , కాలేజీ , సినిమా టాకీసులు , ... బంద్


భారతదేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర రూపు దాలుస్తుంది . కరోనా వైరస్ కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం తమ తమ వ్యూహాలతో ముందుకి పోతున్నాయి .తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలను మార్చి 31 వరకు మూసివేయాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో వివివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.శాసనసభ బడ్జెట్ సమావేశాలను కూడా కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 20 వరకు బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత కరోనా పరిస్థితులు నేపథ్యంలో రేపు, ఎల్లుండి సమావేశాలను నిర్వహించాలని, సోమవారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధిక వాయిదా వేయనున్నట్లు సమాచారం.కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. సినిమా థియేటర్లు, మాల్స్ కూడా బంద్ చేశారు. ఇప్పటి వరకు దేశంలో రెండు కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 5500 మందికిపైగా మరణించారు. లక్ష50వేల మందికిపైగా కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.