మార్చి 6 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు : కేసీఆర్ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి


తెలంగాణ  బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ శాసనసభ సిద్ధమైంది. మార్చి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి . అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌నిన్న విడుదలైంది. మార్చి 6న ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవనున్నాయి . ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఆమె గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం తొలిసారి కావడం గమనార్హం.దేశవ్యాప్తంగా ఆర్థికంగా గడ్డు పరిస్థితి నెలకొనడం, కేంద్ర బడ్జెట్‌ తెలంగాణ వాసులకు పెద్దగా ఊరటనివ్వకపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో.. కేసీఆర్ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకట్రెండు కొత్త పథకాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల దీనికి సంబంధించి హింట్ ఇచ్చారు. మరోవైపు.. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఉన్న పథకాలనే సవరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )