మారుతీ సుజుకీ బిఎస్‌6 వాహనాలపై డిస్కౌంట్ల ఆఫర్లు


మారుతీ సుజుకీ బిఎస్‌6 ప్రమాణాలు కలిగిన పలు కార్లపై డిస్కౌంట్ల ఆఫర్లు , ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆ కంపెనీతెలిపింది . ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్‌ 6 ప్రమాణాలు కలిగిన వాహనాలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అనేక కార్లు, టూవీలర్‌ తయారీ కంపెనీలు బీఎస్‌4 వాహనాలపై ఇప్పటికే భారీ డిస్కౌంట్లను అందిస్తుంటే.. మారుతి బిస్‌6 వాటిపై అందించడం ఆసక్తి రేపుతోంది . మారుతీ సుజుకీ సియాజ్‌ కారును కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులు రూ.45వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చని తెలపింది.మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6 ఎంపీవీ కారుపై రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌ను అందిస్తున్నారు. మారుతీ సుజుకీ బలెనో కారుపై రూ.20వేల వరకు డిస్కౌంట్‌, రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, రూ.5వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చని ఆ కంపెనీ పేర్కొంది.