ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 రకపు ఇంధనాల విక్రయాలు :

భారత దేశ వ్యాప్తంగా  ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 ఇంధన విక్రయాలను పూర్తిస్థాయిలో చేపట్టనున్నట్టు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలుగురాష్ట్రాల ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఆర్‌.శ్రవణ్‌ ఎస్‌.రావు తెలియజేశారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను సైతం నిర్ణయిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. వచ్చే 20 ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని నల్లగొండ జిల్లా మల్కాపూర్‌లో రూ.611 కోట్లతో చేపట్టిన 180 వేల లీటర్ల స్టోరేజీ సామర్థ్యంతో చేపట్టి ఆయిల్‌ టెర్మినల్‌ పనులు వచ్చే ఏడాది పూర్తవుతాయని వివరించారు. దాదాపు రూ. 3800 కోట్లతో పరదీప్‌ పేరుతో హైదరాబాద్‌ పైపులైన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. అలాగే ఇతర పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని చర్లపల్లి ఎల్‌పీజీ ప్లాంటులో రూ. 30 కోట్లతో 2400 మెట్రిక్‌టన్నుల అదనపు ఎల్‌పీజీ ట్యాంకును నెలకొల్పనున్నామని వివరించారు.