ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం పై బ్యాంకు అధికారులతో భేటీ కానున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

 a
భారత దేశ ఆర్థిక  శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రతిపాదిత విలీన బ్యాంకుల అధికారులతో సమావేశంకానున్నారు . ఏప్రిల్‌ 1 నుంచి పది ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ నాలుగు బ్యాంకులుగా విలీనమవుతున్నాయి. ఇందులోభాగంగా ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌.. యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం అవుతాయి. ఈ విలీనాలతో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఆయా బ్యాంకులు తీసుకున్న చర్యలను ఆర్థిక మంత్రి సమీక్షిస్తారు. ఇంకా విలీనం తర్వాత అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చిస్తారని సమాచారం.విలీన ప్రయత్నాలు, అందుకు ఆయా బ్యాంకుల సన్నద్ధతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు.