బాలానగర్‌లో గంజాయి చాక్లెట్ల విక్రయాలు : పట్టుకున్న పోలీసులు

బాలానగర్‌లో గుట్టుగా సాగుతున్న గంజాయి విక్రయాలు .  చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. సనత్ నగర్, ఫతే నగర్ రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.పోలీసులు పక్కా సమాచారంతో ఆయా ప్రాంతాల్లోని షాపుల్లో తనిఖీ చేశారు. తనిఖీల్లో 228 గంజాయి చాక్లెట్లు లభించినట్లు ఎక్సైజ్ సీఐ జీవన్ కిరణ్ తెలిపారు. వీటిలో మొత్తం 1.2 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. జయంత్ ప్రధాన్ (41) అనే వ్యక్తి ఆ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒడిశాకు చెందిన ఆకాష్ దాస్ అనే మరో వ్యక్తితో కలిసి అతడు ఈ చీకటి వ్యాపారం నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )