అమెరికాలో అగ్ని ప్రమాదానికి గురైన తెలుగు వారి.....

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ని అర్వింగ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన తెలుగు కుటుంభాలు, తెలుగు విద్యార్ధులకి నాట్స్ సాయమందించింది. ప్రమాద ఘటన జరిగిన వెంటనే విషయాన్ని నాట్స్ చైర్మెన్ శ్రీధర్ కి సభ్యులు తెలుపడంతో హుటాహుటిన అక్కడికి వచ్చిన శ్రీధర్, భాదితులకి భోరోసా ఇచ్చారు. అక్కడే అద్దెకి ఉంటున్న తెలుగు విద్యార్ధులు తమ విలువైన డాక్యుమెంట్స్ కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ క్రమంలోనే నాట్స్ సభ్యులు బాధితులకి ఆర్ధిక సాయంతో పాటు మౌలిక అవసరాలని సమకూర్చారు. ఈ విషయంపై స్పందించిన నాట్స్ తమ సేవలని మరింతగా పొడిగిస్తున్నామని తెలిపింది. బాధితులకి తక్షణ సాయం అందేలా స్థానిక ప్రతినిధులతో మాట్లాడుతున్నట్లుగా తెలిపారు. నాట్స్ అందించిన ఈ సాయాన్ని ఎప్పటికి మర్చిపోలేమని బాధితులు నాట్స్ కి కృతజ్ఞతలు తెలిపారు.