మరొక బ్యాంక్ తో జతకటిన్న ఫోన్ పే సంస్థ : అందుబాటులోకి వచ్చిన సేవలు


ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన యస్ బ్యాంకు వల్ల ఆన్‌లైన్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే సేవలు మూడు రోజులుగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో మొబైల్ ఫోన్ ద్వారా లావాదేవీలు జరిపే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వారికి ఒక గుడ్ న్యూస్. తొందరలోనే ఫోన్‌పే సేవలు మళ్లీ పునరుద్ధరించనున్నారు. క్రితం యస్‌ బ్యాంకుతో లింకైన ఫోన్‌పే ఇప్పుడు మరో బ్యాంక్‌తో జత కట్టింది. దాదాపు అన్ని ఒప్పందాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఫోన్‌పే సేవలు పున:ప్రారంభమవుతాయని ఫోన్‌పే యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం యస్ బ్యాంక్ నుంచి నెలకు 50 వేల రూపాయలు మాత్రమే తీసుకునే వీలు ఉంది. ఇక పోతే అన్ని ఆన్‌లైన్ లావాదేవీలపై యస్ బ్యాంకు ఆంక్షలు విధించింది. ఇది ప్రత్యక్షంగా ఫోన్‌పేపై పడింది. ఈ క్రమంలో ఫోన్‌పే యాజమాన్యం పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐతో ఫోన్‌పే ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే అన్ని సర్వీసులు ప్రారంభమవుతాయని ఫోన్‌పే ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సమీర్ నిగమ్ ప్రకటించారు. యస్ సంక్షోభం వల్ల ఫోన్‌పేతో పాటు మరో 15 థర్డ్ పార్టీ పేమెంట్స్ సంస్థల సర్వీసులు నిలిచిపోయాయి.