ప్రభాస్ కొత్త సినిమా "రాధే శ్యాం" ఫస్ట్ లుక్ ఉగాది కానుకగా విడుదల


బాహుబలి ప్రభాస్ తదుపరి చిత్రం , ప్రభాస్‌ 20వ చిత్రం "రాధే శ్యామ్ " షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సమయంలోనే సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగాది కానుకగా మార్చి 25వ తారీకున ప్రభాస్‌ 20 చిత్రం ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్‌ 20వ చిత్రానికి పలు టైటిల్స్‌ ప్రచారం జరిగింది. ఇటీవల కాలంలో ఓ డియర్‌ ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఇదే టైటిల్‌ను ఖరారు చేస్తారా లేదంటే కొత్తగా ఏమైనా టైటిల్‌ను ప్రకటిస్తారా అనేది ఈ నెల 25వ తారీకున తేలబోతుంది. ఉగాదికి ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మంచి గుడ్‌ న్యూస్‌ ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ మరియు గోపీకృష్ణ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.