హైదరాబాద్ పోలీసులపై విరుచుకుపడ్డ ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ


హైదరాబాద్ పోలీసులపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి నిప్పులు చెరిగారు. నగరంలోని చార్మినార్ వద్ద ఆర్పీఎఫ్ దళాలను జెండాతో మార్చ్ నిర్వహించడంపై ఆయన ట్విట్టర్ వేదికగా  స్పందించారు. ఆర్పీఎఫ్ దళంతో మార్చ్‌ను కేవలం చార్మినార్ వద్ద మాత్రమే ఎందుకు నిర్వహించారని, నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ‘‘చార్మినార్ వద్ద మాత్రమే ఎందుకు ఈ మార్చ్ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఎందుకు ఈ మార్చ్ చేయలేదు. హైటెక్ సిటీ వద్ద ఎందుకు నిర్వహించలేదు.. లేదా అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీల ముందు ఎందుకు ఇలా చేయలేదు’’ అని ఒవైసీ ట్వీట్ చేశారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )