కరోనా వైరస్ కె కౌంటర్ ఇచ్చిన "డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ".

కరోనా వైరస్ కె కౌంటర్ ఇచ్చిన రంగూన్ రౌడీ "డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ". రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. తాజాగా ఆయన ప్రపంచవ్యాప్తంగా అందరిని భయభ్రంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్‌కే వార్నింగ్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు.'డియర్ కరోనా వైరస్. మూగదానిలా అందరినీ చంపుకుంటూ వెళ్లేబదులు ఒక విషయం గురించి తెలుసుకో. నీవు ఒక పరాన్నజీవివి. మాతోపాటే నీవు కూడా చస్తావ్. నీవు నా మాటలను నమ్మకపోతే. వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో. నీకు నా విన్నపం ఏమిటంటే. బతుకు, బతికించు. నీకు జ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ కు నెటిజన్లు ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు.