జనాల దెబ్బకి దిగివచ్చిన ట్రాయ్


తెలుగు రాష్ట్రాలు , దేశవ్యాప్తంగా కేబుల్ టీవీ , డిటిహెచ్ డిజిటలిజషన్ పేరు తో ముందు ఉన్న సాధారణ చార్జీలలో అన్ని చానళ్ళు పొందిన జనాలు , కేంద్రం తీసుకున్న నిర్ణయం తో వేలలో చెల్లిస్తే కానీ అన్ని చూడలేని స్థితి కి తెచ్చారు . దీనితో జనాలు ఒకటి రెండు ఛానల్స్ తో సరిపెట్ట్టుకొని యూట్యూబ్ , హాట్స్టార్ , జి 5 , వూట్ తో సరిపెట్టుకున్నారు , దీనితో  ట్రాయ్ మార్చి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి తెస్తోంది . ఈ ట్రాయ్ కొత్త విధానం ద్వారా నెలకు రూ . 130 నెలకు చెల్లిస్తే 200 ఉచిత చానళ్లు చూడొచ్చు . గతంలో ఇది కేవలం 100 ఉచిత ఛానల్స్‌ ఉండేవి .. 100 దాటిన తరువాత ప్రతి 25 ఛానళ్లకు 25 రూపాయలతో పాటూ జీఎస్‌టీని అదనంగా చెల్లించాల్లి వచ్చేది . ఇప్పుడు సీన్ మారిపోయింది . నెలకు రూ . 130 కడితే 200 చానల్స్ ఉచితంగా చూడొచ్చు . అంతే కాదు .. గరిష్టంగా ఒక ఛానల్ ధర రూ . 19 ఉండేది . ఇప్పడు దాన్ని రూ . 12 కి తగ్గించారు . ఆ ప్రకారం బొకేలో రూ . 12 లోపు ధర ఉన్నవాటినే చేర్చాల్సి ఉంటుంది . అంతే కాదు .. ఒకే ఇంట్లో రెండు కనెక్షన్‌లు ఉంటే రెండో కనెక్షన్‌కు నెట్‌వర్క్ క్యారియర్ ఫీజులో 40 శాతం చార్జీనే వసూలు చేయాలి .