రేవంత్ కు బెయిల్ రాకుండా ఆయన మీద కేసులు మోపుతున్న తెలంగాణా సర్కార్


ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన పాత కేసుల్లో పీటీ వారెంట్లు చూపిస్తూ రేవంత్ కు బెయిల్ రాకుండా ఆయన మీద కేసులు మోపుతున్న తెలంగాణా సర్కార్ ప్రయత్నం చేస్తుంది. ఇక ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కేసులు పెట్టారని రేవంత్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు. అదే సాకుతో పీటీ వారెంట్‌ ఇస్తున్నారని, బెయిల్‌ ఇవ్వాలని రేవంత్‌ తరపు లాయర్‌ శ్రీనివాసరావు కోరారు. కానీ ప్రభుత్వం రేవంత్ పై వరుస కేసులు బనాయించటం తో రేపు కూడా రేవంత్ కు బెయిల్ వస్తుందా అన్నది అనుమానమే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.