ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సైతం అడ్డంకులుగ్రీస్ లో సైతం కరోనా వైరస్ వ్యాపించడం, రోగుల సంఖ్య 7 నుంచి 73కు పెరగడంతో. రెండువారాల పాటు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొనే క్రీడా కార్యక్రమాలను ప్రభుత్వం రెండు వారాలపాటు రద్దు చేసింది. దీంతో ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సైతం దెబ్బతలిగింది. ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలోనే రెండోసారి. అభిమానులు లేకుండా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ కు సైతం అభిమానులు లేకుండానే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత 35 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి అదే పరిస్థితి పునరావృతమయ్యింది.టోక్యో వేదికగా మరికొద్దిమాసాలలో ప్రారంభంకానున్న 2020 ఒలింపిక్స్ కు సైతం క్రీడల పుట్టినిల్లు ఏథెన్స్ లో.జ్యోతిని గురువారం రాజేయాల్సి ఉంది. వేలాదిమంది సమక్షంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు లేకుండానే .కేవలం ఎంపిక చేసిన 100 మంది ప్రముఖుల సమక్షంలోనే నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం నిర్ణయించింది.