ఆగిన ఫోన్ పే సేవలు : యస్ బ్యాంక్‌పై నెల రోజులపాటు మారటోరియం


రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రైవేట్ రంగానికి చెందిన నాలుగో అతిపెద్ద బ్యాంక్ యస్ బ్యాంక్‌పై నెల రోజులపాటు మారటోరియం విధించింది. దీంతో యస్ బ్యాంక్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బుల కోసం ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారు. ఆర్‌బీఐ తాజా కఠిన నియంత్రణల నేపథ్యంలో యస్ బ్యాంక్ కస్టమర్లు కేవలం నెలకు రూ.50,000 వరకు మాత్రమే అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసుకోవగలరు. ఆర్‌బీఐ నియంత్రణ వల్ల ఇక్కడ కేవలం Yes Bank కస్టమర్లకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరీముఖ్యంగా ప్రముఖ ఫిన్ కంపెనీ ఫోన్ పే యూజర్లకు చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆర్‌బీఐ మారటోరియం వల్ల రాత్రి చాలా సర్వీసులుపై ప్రతికూల ప్రభావం పడింది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )