లారీ టిప్పర్ బైక్ ను ఢీకొనడంతో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు.

కుమ్మరి చంద్రయ్య వయసు ముప్పై ఎనిమిది(38), చాకలి గోపాల్ వయస్సు నలభై(40) ఇద్దరూ కలిసి బైక్ మీద  సదాశివపేట నుండి మేకవనంపల్లి వెళుతుండగా మార్గమధ్యంలో చెరువుకట్ట వద్ద లారీ టిప్పర్ వేగంతో , బైక్ ను ఢీకొనడంతో  చాకలి గోపాల్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది మరియు తీవ్ర గాయాలతో బాధపడుతున్న కుమ్మరి చంద్రయ్య బాలాజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. సదాశివపేట పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేయబడింది ఇట్టి  సంఘటన తెలుసుకున్న మేకవనంపల్లి ఎంపిటిసి గోవర్థన్ రెడ్డి సంతాపం తెలిపి వారి యొక్క కుటుంబంకు న్యాయం చేస్తామని తెలియజేశారు.