ప్రభాస్ కొత్త సినిమా హాలీవుడ్ కాపీ అని నెటిజన్ల ఊహాగానాలు

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'రాధే శ్యామ్' (జనాల టైటిల్) కథ కూడా ఓ హాలీవుడ్ సినిమా కాపీ అని తెలుస్తుంది. మొదట ఈ కథని డిఫరెంట్ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించాలి అనుకున్నాడట. కానీ ఎందుకో అది కుదర్లేదు. దీంతో 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఆ కథని బాగా డెవలప్ చేసుకుని యూవీ క్రియేషన్స్ మరియు ప్రభాస్ కు వినిపించాడు. యంగ్ డైరెక్టర్ కదా.. స్క్రిప్ట్ ఇప్పటి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా రాసుకున్నాడు అని నమ్మి ప్రభాస్ అండ్ యూవీ వారు ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )