రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

ఢిల్లీ :  రాజ్యసభకు 12 మంది అభ్యర్థుల పేర్లను చాలా తర్జన భర్జన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది . వీరిలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, హరియాణా మాజీ సీఎం భూపీందర్‌ సింŠ హూడా కుమారుడు దీపేందర్‌ హూడా, న్యాయవాది కేటీఎస్‌ తుల్సి ఉన్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్, ఫూల్‌సింగ్‌ బరైయాలను ప్రకటించింది. ఈ రాష్ట్రంలో ఉన్న మూడు సీట్లకు గాను ఒక సీటుపై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య గట్టిపోటీ నెలకొంది. కాగా, ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు గాను ఇప్పటికే 9 మంది పేర్లను ప్రకటించిన బీజేపీ గురువారం మరో ఐదుగురి పేర్లను ప్రకటించింది. వీరిలో వెనుకబడిన వర్గానికి చెందిన నేత రామ్‌చంద్ర జంగ్రా, హరియాణాకు చెందిన దళిత నేత, పార్టీ ఉపాధ్యక్షుడు దుష్యంత్‌కుమార్‌ గౌతమ్, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి ఇందు గోస్వామి, మహారాష్ట్ర నుంచి భగవత్‌ కరాడ్, మధ్యప్రదేశ్‌ నుంచి సుమేర్‌ సింగ్‌ సోలంకి ఉన్నారు.