పబ్ లో బీరు సీసాలతో బిగ్ బాస్ విన్నర్ "రాహుల్ సిప్లిగంజ్ " మీద దాడి

పబ్ లో  బీరు సీసాలతో బిగ్ బాస్ విన్నర్ "రాహుల్ సిప్లిగంజ్ " మీద దాడి . వివరాల్లోకి వెళ్తే  హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో దాడి జరిగింది. బీరు సీసాలతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి  వచ్చారు. కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్‌ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి.  రాహుల్‌ను బీరు సీసాలతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా  గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బంధువులతో రాహుల్‌ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వారు రాహుల్‌పై దాడి చేసినట్లు సమాచారం.. గచ్చి బౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం రాహుల్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. తనకు ఏమీ కాలేదని.. చిన్న గాయమే అయిందని  తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా రాహుల్‌ వెళ్లిపోయారు. పబ్‌లో గొడవపై సుమోటోగా కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )