ఉగాది నాడే వకీల్ సాబ్ టీజర్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్, వకీల్ సాబ్ ప్రమోషన్స్ , మార్చి 25న ఉగాది సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారంట. దీని కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటినుండే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. వకీల్ సాబ్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మే 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ రీమేక్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేతా థామస్, అంజలి, అనన్య (మల్లేశం ఫేమ్) నటిస్తున్నారు. ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.
ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. పవన్ కళ్యాణ్ వయసు, ఇమేజ్ ని బట్టి కథలో మార్పులు చేర్పులు చేశారట.