ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయాలపై మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో మీడియా సమావేశం


ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల 50శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సోమవారం ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కుట్రతోనే వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్లు కోల్పోయారని మండిపడ్డారు. బలహీన వర్గాల ఎదుగుదలకు అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని మంత్రి వెల్లడించారు. బీసీలకు చంద్రబాబు ఇచ్చే బహుమానం ఇదేనా అని నిలదీశారు. బలహీన వర్గాలు వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలవడం చూడలేక చంద్రబాబు వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )