కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ ఆగబోయేది లేదన్న లీగ్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌

కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ ఆగబోయేది లేదన్న లీగ్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ . కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా పలు క్రీడా ఈవెంట్లు వాయిదాపడడమో లేదా రద్దవడమో జరుగుతోంది. అయితే, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు మాత్రం కరోనా భయం లేదని లీగ్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ అంటున్నాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు ఢోకా ఉండదనీ.. షెడ్యూల్‌ ప్రకారమే లీగ్‌ జరుగుతుందని ఆయన స్పష్టం చేశాడు. ఐపీఎల్‌ ఈనెల 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో మొదలవనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనుంది.