ప్రజలని దగా చేస్తున్న కేసీఆర్ దొర :

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ అంకెల గారడీల ఉంది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు . 2014 నుంచి 2020-21 బడ్జెట్‌ లెక్కలు చూస్తే వృద్ధి రేటు అర్థమవుతుంది. గత సంవత్సరం బడ్జెట్‌ కంటే 25శాతం పెంచి ప్రజల ను మాయ చేస్తున్నారు. వాస్తవానికి ఏ మాత్రం దగ్గరగా లేదు. ప్రజలను మభ్యపెట్టేందుకు టీఆర్‌ఎస్‌ మరోసారి వంచనకు తెరతీసింది. ఇది ఆచరణలో సాధ్యమయ్యే బడ్జెట్‌ కాదు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకోవ డానికి మాత్రమే అంకెలను పెంచి చూపించారు. ఉద్యోగాలు-మూడెకరాల భూమి తదితర పథకాలు ఎక్కడాకనిపించలేదు. బడ్జెట్‌ నిరాశపర్చింది.ప్రజలని దగా చేస్తున్న కేసీఆర్ దొర అనే విధంగా వ్యాఖ్యానించారు .