వరుసగా బైక్ దొంగతనాలు చేస్తున్న దొంగను పట్టుకున్న పోలీసులు

తెలంగాణ పోలీసులు మరో కేసును పరిష్కరించారు .ద్విచక్రవాహనాల దొంగను మహంకాళి  పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  ఏసీపీ వినోద్‌కుమార్‌ కథనం ప్రకారం... యాకత్‌పుర ప్రాంతానికి చెందిన  మహ్మద్‌ జాఫర్‌ (32) కార్మికుడు. అలాగే ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్నాడు.  ఈ క్రమంలో మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 3, నిజామాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక బైక్‌ను దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బుధవారం మహంకాళి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో వచ్చిన జాఫర్‌ అనుమానాస్పదంగా కనపడగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బైక్‌ చోరీల విషయం బయటపడింది. నిందితుడి నుంచి నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )